Friday, November 16, 2012

రూపం లేని కన్నీరు .....

shanti nibha New Delhi 17.11.12

నువ్వు......నేను ఒక ప్రశ్న ల మిగిలిపోతున్నాము…????

నా కలలోనూనువ్వే అన్నావు… కలలో కూడా కవ్వింతలే అన్నావు… అదేమిటో నాకు కలలు రావు.... నిదురె లేని నాకు కల ఎక్కడిది? మెలుకువగా ఉండి కలలు కంటారు కొందరు .. ఆ కళ కూడా లేదు నాలో.. తెలియని ఆలోచనలు…ఆ ఆలోచనలు ఏమిటో ఆది కూడా తెలియదు... ఏమిటో జీవితం ఒక నిట్టూర్పుగా ఉంటోంది.. నీ ఆరాధనని ఆస్వాదించలేక పోతున్నాను.. నిన్ను తలచుకున్నప్పుడు తెలియని చిలిపి తలపులు….....చెక్కిల్లు ఎరుపెక్కుతున్నాయి .. చేరువగ లేవని దిగులుగ ఉంది.. ఇదే నా నిదుర లేమికి కారణం అనుకుంటాను.. నువ్వు......నేను ఒక ప్రశ్న ల మిగిలిపోతున్నాము…???? శాంతి నిభా new delhi 16.11.12

Thursday, November 15, 2012

వయసు ....

shanti nibha New Delhi 15.11.12

నిస్సహాయత ...

Drawing: Aditya Nibhanapudi
Shanti Nibha New Delhi 15.11.12

Wednesday, November 7, 2012

క్షీరజా….

Drawing: Aditya Nibhanapudi
మధురంగా రాసినపుడు…. ఊహించే జవాబు ను చూడగాలుగుతాను…. అందుకే నువ్వు నచ్చావురా!!!!... ప్రేమ విలువ తెలుసు... మాటల మాధుర్యం తెలుసు... అక్షరాల పొందిక …ఆ కూర్పు ఒ!!! గ్రేట్ ఆణిముత్యం లాంటి అక్షరాలను ఎక్కడ ...ఎప్పుడు అల్లలో తెలుసు... ఈ అక్షరాల అల్లికలో ల నిన్ను అల్లుకు పోతున్నాను…. రోజు రోజుకి చేరువ అవుతున్నాను…చెక్కిల్లు ఎరుపెక్కుతున్నాయి... ప్రపంచంలో ఇంత ప్రేమవున్నదని...ఇంతగా ప్రెమిన్చెవారున్తారని... తెలిసింది...నే తోడు నేనే అంటూ మనసుకు అండగా నిలిచవు... ఈ ప్రేమను చేజారనివాకు... చేజార్చనీయను.. ఒక్కటి మాత్రం నిజం … నువ్వు ఒక మధురమైనా ప్రేమికుడివి.. సదా నీ ప్రెమలొ...తెలిపొతున్న....అన్దమైన అప్పాలమ్మ….హహ్హ్హహ్ ఏమిటి అలా మొహం పెట్టవు ….పేరు బాగాలేదా…. ఒక్… నీఊహాసున్దరి క్షీరజా…. shanti nibha New Delhi 08.11.12

Tuesday, November 6, 2012

మైకం......

Drawing: Aditya Nibhanapudi
చాలా చెప్పాను నీతో.... నేను చెప్పింది ఎంతో తక్కువ అనిపించింది.. ఇంకా గుస గుస గా చెప్పాలనిపించింది..... చెప్పలేక గుండె బరువెక్కి పోయింది.. గుండెలోతుల్లో చిలిపి బాధ... చిగురించే బాధ.... చేరువ కాలేని బాధ.... చేరువ అవ్వాలని ఉంది…..... చేరువైతే చెంగు చాటున చెరిపొతావెమొ......ంమ్మ్మ్మ్ గుర్తుకి వచ్చినపుడు తెలియని గిలిగిన్త ఎదలో ఏదో తెలియను... ఆరాటం.. అందుకోవాలన్న ఆరాటం.. అందుకోలేక పోతున్న నిట్టూర్పు.... తీపి భాధా .... అందమైనభాధ.... మైకంకమ్మే బాధ... ఎమౌుతోందినాలో... మనసు లోని స్పందన ఇంతలా ఉంటుందా????ఏమో…. Shanti Nibha New Delhi 07.11.12

అనామిక .....

Drawing : Aditya Nibhanapudi
ఎలావున్నావు నించి ఏమిటిరా !!! అనే పిలుపుకు పయనించిన ప్రేమ.... చిటపటల నించి చిరునవ్వుకు చేరిన ప్రేమ.. చిరునవ్వు నించి చెంగు చాటున చేరిన ప్రేమ.... చెంగు చాటున దోబుచులాడుతున్న ప్రేమ... మాటల మధురిమ నించి ఆధారాల మధురిమలకు చేరిన ప్రేమ... ఊహలలో ఔర్రుతలుగినచ్ చేరువై ఒకరిని ఒకరు కలుసుకున్నప్రేమ... చూపులు కలిసినా చెంత చేరని ప్రేమ.. చెంత చేరిన చెయ్యి అందించని ప్రేమ... ఇద్దరి కళ్ళల్లో విడిపోతున్న ప్రేమ... తనువులు దూరమైనా మనసులో పదిలంగా దాచిన ప్రేమ ... ఇంతటి ప్రేమను అందించే నీకు నేను ఏమి ఇవ్వగాలనురా? నా ఆఖరి శ్వాస వరకు నీ ప్రేమ లోనే జీవిస్తానురా.. అంతవరకూ నా నీడలా వుంటావ న్న నమ్మకంతో, కంట కన్నీరు పెట్టిన్చావన్న ఆత్మా విశ్వాసంతో....జీవిస్తానురా... నీ ప్రియమైన, ప్రాణమైన....అనామిక shanti nibha New delhi 06.11.2012

Saturday, September 29, 2012

ఆడవాళ్ళు...ఇంత అవసరమా ఈ ముగిసిపోయే జీవితానికి...???

మదిలోఎన్నో ఆశలతో పెల్లిచుపులలో తలదించుకుని...కనుకోనలలోంచి చూసి చూడనట్టు చిలిపి చూపులతో చూపుని కలిపి మైమరుపు కలిగిస్తారు. పెళ్లి లోను తలదించుకొని తాళి కట్టించుకొని ...తనమ్యత్వం పొందుతారు.. ఆ తన్మయత్వం లోనే తమకం గ తలంబ్రాలు పోయించుకొని మురిసిపోతారు.. ఓర చూపులు చూస్తూ ఊరిస్తారు... ఆ చుపులోని కవ్వ్వింపు తో తనువులో జ్వాలను రేపుతారు... కొంటేపనులతో కాలాన్ని మరిపిస్తారు.. చిరుకోపం కనపరిచి...చిరునవ్వుని సొంతం చేసుకుంటారు.. అక్కడినించి మొదలవుతుంది పెత్తనాలు... చిరుకోపం కాస్తా చిరాకై.. చిట పటలతో ..చిరుబురులాడుతారు.. తన భర్త తనకోసమే దాసోహం అవ్వాలని తాపత్రయపడతారు ... కొంగున ముడివేసుకొని కట్టుదిట్టం చేస్తారు..ఆ కట్టుదిట్టలలో కన్నవారిని (అత్తా మామలని) కూడా కనుమరుగు చేస్తారు... ఆ కనుమరుగులో కన్నవారి కన్నీరు కానరాదు.. ఏదో కనపడనీయని తృప్తి... వయసుమళ్ళిన తరువాత తను చేసిన తప్పే ఎదుర్కొంటుంది... మౌనం గ శిక్షని అనుభవిస్తుంది... ఆడవాళ్ళు...ఇంత అవసరమా ఈ ముగిసిపోయే జీవితానికి...??? వివాహంలో పొందిన తన్మయత్వాన్ని...కలిసివుండి జీవితాలను సుఖమయం చేసుకోండి. ఎన్నో ఆశలతో వచ్చే(కోడలిని) అమ్మాయి లో కూతురిని చుడండి...అలాగే అత్తా మామలని తల్లితండ్రులుగా భావించి జీవితం సుఖమయం చేసుకోండి. చదివి ,ఎదుటివారి సంసారాలు చుసిన సంఘటనలు కలిచివేసి రాసినదే సుమా!!! ఇందులో ఎవరిని కిన్చాపరిచేట్టు రాసింది కాదు. shanti nibhanapudi New Delhi 29.09.12

Wednesday, September 26, 2012

తప్పటడుగు.....

తప్పటడుగు వేసి ....తప్పుచేసాను... తప్పు అని తెలియరాలేదు... తెలిసిన క్షణం తలదిన్చుకున్నాను.... కాని... తప్పించుకోలేదు... తల రాత అని అనుకోలేదు... తల్లడిల్లే మనసును సమాధి చేసాను.... Shanti nibha

Monday, September 17, 2012

ఆమె నన్ను చూసి నవ్వింది......

దీపాలి, నేను ఇద్దరం మార్నింగ్ walk కి వెళ్లి తిరిగి వస్తున్నాము... నేను కొంచే ముందుగ నడుస్తున్నాను... ఒకచోట ఒక కుక్క ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టు కూర్చొని వుంది... నేను ఆ కుక్కను చూసి ముందుకి నడిచాను.. ఒక ఆడమనిషి నాకు ఎదురు పడింది. నాకు తెలియదు కదా...నేను తలవంచుకొని ముందుకి నడిచాను... నావెంకనే వస్తున్నా దీపాలి నా దగ్గరికి వచ్చి...mom ఆమె నన్ను చూసి నవ్వింది..అన్నది.. achha ...నాకు తెలియదే..నీకు ఎలాతెలుస్ అని అడిగాను.. no ...mom ..ఆమె...that dog ...నన్నుచుసింది...నా కళ్ళలోకి చూసింది..she is loughing also...అన్నది. ఓహ్!!మై గాడ్!! ఆమె అంటే కుక్క న అని అడిగాను.... yes ...mom . that dog is she ..." ఆమె" అని అంటారుకదా తెలుగులో... అన్నది. పిల్లని ఏమనాలో తెలియక ఎంతొ నవ్వుకున్నాను.....so రోజు "ఆమెని" చూస్తూ చిన్నగా నాలోనేను నవ్వుకుంటాను... shanti nibha 17.09.12

Saturday, September 15, 2012

పసుపురంగు పుష్పం .......

రోజు ఉదయం walking కి వెళ్ళినపుడు ఎన్నో రంగు రంగుల పువ్వులనుచూస్తున్నను... దేవుడి కోసం అందులోని కొన్ని పువ్వులను కోసుకుందామని క్షణం పాటు అనిపించినా...ఎందుకో పూలను కొయ్యటానికి మనసు రావటం లేదు. ఆ పుష్పాలలో ఏ వొక్కటి కోసిన ..మరొక పుష్పం జాలిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. నన్ను కూడా దేవుడి పాదాల చెంత చేర్చవచ్చుకదా అని. పూజకు పువ్వులను కొని దేవుడికి పూజ చెయ్యగలుగుతున్నాను..కాని పువ్వులను చెట్టు నించి కోయ్యలేకపోతున్నాను. ఈ రోజు ఉదయం ఉద్యానవనం లో నడుస్తున్నపుడు సరిగ్గా నా కాలి ముందు పసుపురంగు పుష్పం చెట్టు మీదినించి పడింది. వెంటనే చేతిలోనికి తీసుకొని ఎంతొ ఆలోచించాను ... ఈ పుష్పం దేవుడి పాదాలను చేర్చన? లేక నా జడలో అందంగా అమర్చాన... లేక ఎవరు తొక్కని చోట ఉంచాన అని... ఎందుకో అలాగే చేతిలోనే పట్టుకొని ఇల్లు చేరాను. పూసిన ప్రతి పువ్వు దేవుడి పాదాలను చేరలేవు.. కాని దేవుడి పాదాలను చేర్చమని కోరినట్టి నా ఎదురుగ రాలిన ఆ పసుపు వర్ణం పుష్పాన్ని పూజలో సాయిబాబా పాదాలముందు వుంచాను. అప్పుడు మనసుకు తృప్తి కలిగింది. Shanti Nibha New Delhi 15.09.12

Wednesday, September 12, 2012

నువ్వంటే నాకు ప్రాణం అని....

నా కనుచూపె చాలు...నా దరిచేరటానికి... నా చిరునవ్వే చాలు...నా ఆధారాలను అందుకోవటానికి... నా శ్వాసే చాలు...నా గుండెలోతుల్లో చేరటానికి... నాలోని వయ్యారమే చాలు...నా ఒడిలో చేరటానికి... నా ప్రేమే చాలు నాతొ జీవించటానికి.... అని అనుక్షణం అనుకున్టువుంటాను.... .కాని .... ఎక్కడ కానరావు..... ఎక్కడ ఉన్నవో తెలియదు.. ఎలావున్నావో తెలియదు... ఎప్పుడు దరి చేరుతావో తెలియదు... ఏమితెలియను నీ గురించి ఇంతగా అలోచిన్చానంటే.. అర్థం చేసుకోలేవ...నువ్వంటే నాకు ప్రాణం అని.... Shanti Nibha 12.09.12

ఈ పిలుపు కోసమే ఎదురుచుసానురా..

ప్రియా ప్రియ సఖి... ప్రియ రాగమా.. ప్రియ ప్రేమాను రాగమా!!!!... ఓహ్!!! ఎంత మధురంగా పిలుస్తావురా.. ఈ పిలుపు కోసమే ఎదురుచుసానురా..గడిచిన జీవితంలో... ఈ పిలుపు చాలు మిగిలిన జీవితం "శాంతి" గా జీవించటానికి.... నీ రాగమయి... .. shanti nibha 12.09.12

Saturday, August 18, 2012

కావ్య కారుణ్య.....

కనుల ముందు నువ్వే.... కలల లోను నువ్వే.. ... కనుపాపల్లోను నువ్వే... కనురెప్పల్లోను నువ్వే... కౌగిలింతల్లోను నువ్వే... కొంటె పనులలోను నువ్వే... కోరుకున్న్వాడివి నువ్వే... కొంగు బంగారనివి నువ్వే... కష్టలలోను నువ్వే... కన్నేటిలోను నువ్వే... కరునలోను నువ్వే.... కారుణ్యం లోను నువ్వే... కాలగమనంలోను నువ్వే... కావ్య కావ్యాల్లోనూ నువ్వేయని తలచాను.. కారణం తెలియకనే... కనుమరుగై పోయావు....... కలం చేతపట్టుకొని కావ్యాలు రాసుకునే కావ్య..... కాలం కలిసిరాక. కట కటాల నడుమ... కాంతివిహీనమై... కనులుమూసేను... కావ్య కారుణ్య..... shanti nibha 18.08.12

Friday, August 17, 2012

నీకై తపించే నీ కావ్యమాల.......

నా ప్రియమైన అభిశాక్. .... ప్రతిరోజూ నిన్ను చూస్తున్నాను.. .పలకరిస్తావేమోనని చిరునవ్వు చిందించాను.... ....పలకరించిన మరుక్షణం నీ వొడిలోవాలిపోవలనుకున్నాను.... నా పిచ్చి కాని ... అసలు నువ్వు పలకరిస్తేనేకడ......???:(:(:( నీ పిలుపుకోసం ఎంతకాలం ఎదురుచుడను??? mmm .......... ... ఐన ఎదురుచుసాను... ఎదురు చూస్తున్నాను........చూపు మందగించెంట వరకు ఎదురు చూస్తూనే వుంటాను.... నీకై తపించే నీ కావ్యమాల ...

Monday, May 28, 2012

మాటలతో కవ్వించకు...

మాటలతో కవ్వించకు... మనసు నా మాట వినక పోవచ్చు... చూపులో చూపుని కలపవద్దు... కనుపాపలొ కలిసిపోతావు.... శాంతి నిభ న్యూ డెలి

Friday, May 25, 2012

Preyasi

Shanti nibha 25.05.12

Friday, April 27, 2012

shanti nibha new delhi

Wednesday, April 25, 2012

జీవితం లో జీవించు…

అబ్భా!!! ఈ రోజు గడిచింది అని సంతోశించకు…. నీ జీవితంలో ఒకరోజు తరింగిందని విచారించు… అందుకే రోజులు గడుపుతున్న కొలది మానవత్వం విలువలను తెలుసుకో… మంచితనంతో ఉండు… నిజం లో జీవించు… నిజాయితీని పంచు… చిట్ చిట్ లాడకు.. చిరునవ్వులు చిలకరించు… చిలకరించిన ఆ చిరునవ్వుల్‌ళో ఎన్ని ముత్యాలు ఉంటాయో గమనించు… మాటలో అప్పుడప్పుడు మౌనాన్ని కనపరుచు… తోడుగా ఉండు.. నీడల కాపాడు… ఆశపడు..... నీరసాన్ని కనపరచనీయకు… మ్మ్మ్మ్….ఇప్పుడు హాయిగా మిగిలిన జీవితం లో జీవించు… shanti nibha New Delhi 25.04.12

బివేర్ ఒఫ్ చెలిమి (లవ్) ....

చెలియా….అంటూ చెంత చెరావు... చెలిమిని నింపావు… చెంప లను … చూంభించవు ... ముద్దడావూ …. ఆస్వాదించవు…. అనుభవించావు… ఆవకాసవాదివై అర్ధాంతరంగా అదృశ్యం ఐపోయావు…. ఇంకేముంది… చెమ్మగిళ్లిన కళ్ళు… చితికిన జీవితం … చైతన్యం లేని శరీరం…. సో…బివేర్ ఒఫ్ చెలిమి (లవ్) .... shanti nibha New Delhi 25.04.12

స్తితి.....

చితీకీపోయిన నీ స్తితిని చూసి అయ్యో అనుకున్నాను… ఎటువంటి దానివి ఎలా జీవిస్తున్నావన్న విషయం తెలిసి హృదయ వెదనతొ రోదించాను… నీ మొండి తనమే నిన్ను ఈ స్టితికి చేర్చింది…. ఇకనైనా నీ మూర్ఖత్వం…మొండి తనం మాని కాల స్తితిని బట్టి జీవించు… అప్పుడే…మన స్తితి స్తిరముగ ఉంటుంది… నిన్ను కించాపరచటానికి రాలేదు.. నేనున్నాను అంటూ నీ చెంత చేరి నిన్ను మళ్లీ ఉన్నత స్టితిలోనికి తీసుకురావలి అన్న నా నిర్ణయాంలో నీ చెంత చేరాను… స్నేహితుడిగా ఇంతకంటే ఏమి చేయూత నివ్వగలను??? shanti nibha New Delhi 25.04.12

నీ రాగం ఎంత మధురం...

నీ రాగాలాపనలో…అలిసిన నా శరీరం ఆనందంతో ఊయయాలాలూగుతూ నన్ను నేనే మరిచాను.... ఈ హాయి ఎంతో సేపు నిలవలేదు… నీ మాట విన్న క్షణం నీ కరుకుతనానికి నా మనసు కుంచించుకు పోంది… నీతో స్నేహాన్ని పెన్చుకొలెను..అని చెప్పి తున్చెయ్యలెను. .. నీ రాగం ఎంత మధురం... నీ మాట అంతా గరలమ్ నీ మాటలో మృదుత్వాన్ని నింపాలని ప్రయత్నించాను…ఓడిపోయాను. నువ్వు ఇంతే అనుకోని నిశభ్దమ్గ నిట్తూర్చాను…. shanti nibha New Delhi 25.04.12

Saturday, April 7, 2012

మంచితనం ...

ఎంతో మంచి మనిషి అని అనిపించుకోవాలని
మంచితనం తో ఉండటంలేదు....
మంచితనంతో ఉండాలని మంచిదానిగా ఉన్నాను...

ఆ మంచితనమే ఆఖరి శ్వాస వరకు మిగిలిపోవాలని
అర్థం లేని అవమానాలను ఎదురుకొంటూ..భరిస్తున్నాను మౌనంగా..
ఇంత అవసరమా ఈ రాలిపోయే జీవితానికి అని అనుకున్న క్షణం...
చిరునవ్వే సమాధానం ఐనది...

శాంతి నిభ
న్యూ డెలి

Friday, April 6, 2012

అడ్డు గోడ

మన ఇద్దరి నడుమ ఈ అడ్డు గోడ ఎంతకాలం?
అడ్డు గోడను దాటి ప్రతిరోజు పలకరించు కుంటున్నామే కానీ..
తనేవితీరా చూపులను కలపలెక పోతున్నాము...
నీ కళ్ళాలోకి చూస్తూ ఏదో చెప్పాలను కున్న క్షణం....
భాష కు అందని భావాలని వెలిబుచ్చాలని అనుకున్న క్షణం ...
ఎవరి నీడో మన ఇద్దరి నడుమ పడటం...తత్టర పాటు తో విడిపోవటం..
ఇలా ఎంతకాలం?
ఈ బిడియం ఎందుకు నాలో...
బిగీ కొవ్గిలి చెరెది ఎన్నడు?
నాలోని ...
తపన...
దాహం...
మోహం...తీరెది ఎన్నడు?


శాంతి నిభ
న్యూ డెలి

Monday, January 2, 2012

ప్రశ్న!!???


చితికిన జీవితాన్ని అడిగాను..
ఎందుకీల గాయపడినది నా మనసని...
సమాధానము లేదంటూ సమాధానము ఇచ్చింది
సమాధానము లేని ప్రశ్నల మిగిలిన నా జీవితం..

shanti nibha
02.01.2011

కోపమా !!! చిరుకోపమా!!! చిద్విలాసమా!!!


కోపమా !!! చిరుకోపమా!!! చిద్విలాసమా!!!
చారదెసి కళ్లదానా...
చిందులేసే వయసులో ఈ చింతలెందుకే చంద్రముఖి....
సోయకన్నుల సుమాజాక్షి..
కలత నిదురమాని కరునిచవె ....
పరువాల పంకాజాక్షి...
పట్టు పరుపు మీద పవ్వాలించవే...
జామురాతిరి జారిపోతున్నది దరిచేరావే నెరజాన....

shanti nibha
01.01.2012