Saturday, September 15, 2012

పసుపురంగు పుష్పం .......

రోజు ఉదయం walking కి వెళ్ళినపుడు ఎన్నో రంగు రంగుల పువ్వులనుచూస్తున్నను... దేవుడి కోసం అందులోని కొన్ని పువ్వులను కోసుకుందామని క్షణం పాటు అనిపించినా...ఎందుకో పూలను కొయ్యటానికి మనసు రావటం లేదు. ఆ పుష్పాలలో ఏ వొక్కటి కోసిన ..మరొక పుష్పం జాలిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. నన్ను కూడా దేవుడి పాదాల చెంత చేర్చవచ్చుకదా అని. పూజకు పువ్వులను కొని దేవుడికి పూజ చెయ్యగలుగుతున్నాను..కాని పువ్వులను చెట్టు నించి కోయ్యలేకపోతున్నాను. ఈ రోజు ఉదయం ఉద్యానవనం లో నడుస్తున్నపుడు సరిగ్గా నా కాలి ముందు పసుపురంగు పుష్పం చెట్టు మీదినించి పడింది. వెంటనే చేతిలోనికి తీసుకొని ఎంతొ ఆలోచించాను ... ఈ పుష్పం దేవుడి పాదాలను చేర్చన? లేక నా జడలో అందంగా అమర్చాన... లేక ఎవరు తొక్కని చోట ఉంచాన అని... ఎందుకో అలాగే చేతిలోనే పట్టుకొని ఇల్లు చేరాను. పూసిన ప్రతి పువ్వు దేవుడి పాదాలను చేరలేవు.. కాని దేవుడి పాదాలను చేర్చమని కోరినట్టి నా ఎదురుగ రాలిన ఆ పసుపు వర్ణం పుష్పాన్ని పూజలో సాయిబాబా పాదాలముందు వుంచాను. అప్పుడు మనసుకు తృప్తి కలిగింది. Shanti Nibha New Delhi 15.09.12

No comments:

Post a Comment