Saturday, September 29, 2012
ఆడవాళ్ళు...ఇంత అవసరమా ఈ ముగిసిపోయే జీవితానికి...???
మదిలోఎన్నో ఆశలతో పెల్లిచుపులలో తలదించుకుని...కనుకోనలలోంచి
చూసి చూడనట్టు చిలిపి చూపులతో చూపుని కలిపి మైమరుపు కలిగిస్తారు.
పెళ్లి లోను తలదించుకొని తాళి కట్టించుకొని ...తనమ్యత్వం పొందుతారు..
ఆ తన్మయత్వం లోనే తమకం గ తలంబ్రాలు పోయించుకొని మురిసిపోతారు..
ఓర చూపులు చూస్తూ ఊరిస్తారు...
ఆ చుపులోని కవ్వ్వింపు తో తనువులో జ్వాలను రేపుతారు...
కొంటేపనులతో కాలాన్ని మరిపిస్తారు..
చిరుకోపం కనపరిచి...చిరునవ్వుని సొంతం చేసుకుంటారు..
అక్కడినించి మొదలవుతుంది పెత్తనాలు...
చిరుకోపం కాస్తా చిరాకై..
చిట పటలతో ..చిరుబురులాడుతారు..
తన భర్త తనకోసమే దాసోహం అవ్వాలని తాపత్రయపడతారు ...
కొంగున ముడివేసుకొని కట్టుదిట్టం చేస్తారు..ఆ కట్టుదిట్టలలో కన్నవారిని (అత్తా మామలని) కూడా కనుమరుగు చేస్తారు...
ఆ కనుమరుగులో కన్నవారి కన్నీరు కానరాదు..
ఏదో కనపడనీయని తృప్తి...
వయసుమళ్ళిన తరువాత తను చేసిన తప్పే ఎదుర్కొంటుంది...
మౌనం గ శిక్షని అనుభవిస్తుంది...
ఆడవాళ్ళు...ఇంత అవసరమా ఈ ముగిసిపోయే జీవితానికి...???
వివాహంలో పొందిన తన్మయత్వాన్ని...కలిసివుండి జీవితాలను సుఖమయం చేసుకోండి.
ఎన్నో ఆశలతో వచ్చే(కోడలిని) అమ్మాయి లో కూతురిని చుడండి...అలాగే అత్తా మామలని తల్లితండ్రులుగా భావించి జీవితం సుఖమయం చేసుకోండి.
చదివి ,ఎదుటివారి సంసారాలు చుసిన సంఘటనలు కలిచివేసి రాసినదే సుమా!!! ఇందులో ఎవరిని కిన్చాపరిచేట్టు రాసింది కాదు.
shanti nibhanapudi
New Delhi
29.09.12
Subscribe to:
Post Comments (Atom)
శాంతి గారూ !
ReplyDeleteమీకు, మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు
శిరాకదంబం వెబ్ పత్రిక