Thursday, June 30, 2016

ఒక తల్లి ఆవేదన....


Sketch: Aditya Nibhanapudi..

ఒక తల్లి ఆవేదన....

ప్రసవ వేదనలో  అలిసి సొలిసి న నా కళ్ళలో తెలియని తృప్తి.....
జూన్ 20 న ఈ లోకంలోకి తొంగి చూసిన ఒక పసి ప్రాణం...
కానీ పుట్టిన వెంటనే ఏడవలేదు..నిన్ను ఎంతో హింస పెట్టించి ఏడిపించారు..
ఆ సమయంలో అనుకోలేదు నేను జీవితాన్తమ్ నీ జ్ఞాపకాలతో మిగిలిపోతానని..
నీ ఏడుపు విన్న క్షణం నాలో ఆనందం..
మాలో అంనందం...అందరిలో ఆనందం...
తొలి కాన్పు లో తొలకరి ఆనందం...
సూర్యుని తేజస్సుల ఉదయించాడు అనుకున్నాను...
సూర్య తేజ వి నువ్వే అనుకున్న...
కానీ..
నా దురదృష్టం నన్ను నీడలా వెంటాడి ఉందని ఊహించలేదు..
ఒక్క క్షణమైనా నా ఒడిలో చేర్చుకొని లాలించలేదు  ..
ఏమి జరుగుతోందో  తెలియటం లేదు..
నీ లే లేత పాదాల లోని నరాలను గుచ్చుతూ నిన్ను బ్రతికించాలని శ్రమపడుతున్నారు  ..
పసి ప్రాణం బాధ పడుతుంటే రోదిస్తూ మౌనం  వహించాను.
ఏమి తెలియని నా చిన్న వయసు ..నా గుండె తట్టుకోలేకపోయింది.
ఇలా నిన్ను హింస పెడుతూ...నేను నరకం అనుభవిస్తూ తొమ్మిది  రోజులు గడిపాము..
తొమ్మిదవ రోజు రాత్రి  అంత అంధకారం..స్మశాన వాతావరణం లో ల ఒక నల్ల పిల్లి రోదన..
ఆ ఆక్రోధన  నేటికీ నా చెవిలో మారు మ్రోగుతూవుంటుంది..
కోన ఊపిరిలో ఉన్నవని తెలియదు నాకు..
కానీ దేవుడికి తెలుసు అనుకుంటా ...
10 వ రోజు ఉదయాన్నే అంటే జూన్ 30 న నువ్వు కన్ను మూసావు.
అయిపోయింది...అంత అయిపోయింది.అంత నిశ్శబ్డం..
నిన్ను నా నించి శాశ్వతం గా దూరం  చేసాయి..
డాక్టర్ల నిర్లక్షయం..మూఢ నమ్మకాలు...చాదస్తం..ఇలా అందరూ కలిపి నా చిన్నారిని ఈ లోకం లో బ్రతకనీయకుండా చేశాయి.
ప్రతి సంవత్సరం  జూన్ 30 న నా కళ్లనుండి రాలే కన్నీటి చుక్కే    నీకు నేను సమర్పించే ఆశ్రువాలి.
నా మౌనమే చెపుతుంది ఆ రోజు నీతోనే నేను మాట్లాడుతున్నానని.
నీ చిన్ని చిన్ని చేతులు .....నీ తల మీది నల్లటి జుట్టు....నీ  వీపు మీది ఎడమవైపు పెద్ద పుట్టు మచ్చ...ఇలా ఎంతో అందంగా పుట్టిన నీ రూపే నాకు జ్ఞాపకం..
తల్లి   నించి వేరు చేయలేని బంధమే ఈ మాతృత్వం.

Shanti Nibha
30.06.2016
New Delhi

No comments:

Post a Comment