Friday, November 16, 2012
నువ్వు......నేను ఒక ప్రశ్న ల మిగిలిపోతున్నాము…????
నా కలలోనూనువ్వే అన్నావు…
కలలో కూడా కవ్వింతలే అన్నావు…
అదేమిటో నాకు కలలు రావు.... నిదురె లేని నాకు కల ఎక్కడిది?
మెలుకువగా ఉండి కలలు కంటారు కొందరు .. ఆ కళ కూడా లేదు నాలో..
తెలియని ఆలోచనలు…ఆ ఆలోచనలు ఏమిటో ఆది కూడా తెలియదు...
ఏమిటో జీవితం ఒక నిట్టూర్పుగా ఉంటోంది..
నీ ఆరాధనని ఆస్వాదించలేక పోతున్నాను..
నిన్ను తలచుకున్నప్పుడు తెలియని చిలిపి తలపులు….....చెక్కిల్లు ఎరుపెక్కుతున్నాయి ..
చేరువగ లేవని దిగులుగ ఉంది..
ఇదే నా నిదుర లేమికి కారణం అనుకుంటాను..
నువ్వు......నేను ఒక ప్రశ్న ల మిగిలిపోతున్నాము…????
శాంతి నిభా
new delhi
16.11.12
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment