Saturday, September 29, 2012

ఆడవాళ్ళు...ఇంత అవసరమా ఈ ముగిసిపోయే జీవితానికి...???

మదిలోఎన్నో ఆశలతో పెల్లిచుపులలో తలదించుకుని...కనుకోనలలోంచి చూసి చూడనట్టు చిలిపి చూపులతో చూపుని కలిపి మైమరుపు కలిగిస్తారు. పెళ్లి లోను తలదించుకొని తాళి కట్టించుకొని ...తనమ్యత్వం పొందుతారు.. ఆ తన్మయత్వం లోనే తమకం గ తలంబ్రాలు పోయించుకొని మురిసిపోతారు.. ఓర చూపులు చూస్తూ ఊరిస్తారు... ఆ చుపులోని కవ్వ్వింపు తో తనువులో జ్వాలను రేపుతారు... కొంటేపనులతో కాలాన్ని మరిపిస్తారు.. చిరుకోపం కనపరిచి...చిరునవ్వుని సొంతం చేసుకుంటారు.. అక్కడినించి మొదలవుతుంది పెత్తనాలు... చిరుకోపం కాస్తా చిరాకై.. చిట పటలతో ..చిరుబురులాడుతారు.. తన భర్త తనకోసమే దాసోహం అవ్వాలని తాపత్రయపడతారు ... కొంగున ముడివేసుకొని కట్టుదిట్టం చేస్తారు..ఆ కట్టుదిట్టలలో కన్నవారిని (అత్తా మామలని) కూడా కనుమరుగు చేస్తారు... ఆ కనుమరుగులో కన్నవారి కన్నీరు కానరాదు.. ఏదో కనపడనీయని తృప్తి... వయసుమళ్ళిన తరువాత తను చేసిన తప్పే ఎదుర్కొంటుంది... మౌనం గ శిక్షని అనుభవిస్తుంది... ఆడవాళ్ళు...ఇంత అవసరమా ఈ ముగిసిపోయే జీవితానికి...??? వివాహంలో పొందిన తన్మయత్వాన్ని...కలిసివుండి జీవితాలను సుఖమయం చేసుకోండి. ఎన్నో ఆశలతో వచ్చే(కోడలిని) అమ్మాయి లో కూతురిని చుడండి...అలాగే అత్తా మామలని తల్లితండ్రులుగా భావించి జీవితం సుఖమయం చేసుకోండి. చదివి ,ఎదుటివారి సంసారాలు చుసిన సంఘటనలు కలిచివేసి రాసినదే సుమా!!! ఇందులో ఎవరిని కిన్చాపరిచేట్టు రాసింది కాదు. shanti nibhanapudi New Delhi 29.09.12

Wednesday, September 26, 2012

తప్పటడుగు.....

తప్పటడుగు వేసి ....తప్పుచేసాను... తప్పు అని తెలియరాలేదు... తెలిసిన క్షణం తలదిన్చుకున్నాను.... కాని... తప్పించుకోలేదు... తల రాత అని అనుకోలేదు... తల్లడిల్లే మనసును సమాధి చేసాను.... Shanti nibha

Monday, September 17, 2012

ఆమె నన్ను చూసి నవ్వింది......

దీపాలి, నేను ఇద్దరం మార్నింగ్ walk కి వెళ్లి తిరిగి వస్తున్నాము... నేను కొంచే ముందుగ నడుస్తున్నాను... ఒకచోట ఒక కుక్క ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టు కూర్చొని వుంది... నేను ఆ కుక్కను చూసి ముందుకి నడిచాను.. ఒక ఆడమనిషి నాకు ఎదురు పడింది. నాకు తెలియదు కదా...నేను తలవంచుకొని ముందుకి నడిచాను... నావెంకనే వస్తున్నా దీపాలి నా దగ్గరికి వచ్చి...mom ఆమె నన్ను చూసి నవ్వింది..అన్నది.. achha ...నాకు తెలియదే..నీకు ఎలాతెలుస్ అని అడిగాను.. no ...mom ..ఆమె...that dog ...నన్నుచుసింది...నా కళ్ళలోకి చూసింది..she is loughing also...అన్నది. ఓహ్!!మై గాడ్!! ఆమె అంటే కుక్క న అని అడిగాను.... yes ...mom . that dog is she ..." ఆమె" అని అంటారుకదా తెలుగులో... అన్నది. పిల్లని ఏమనాలో తెలియక ఎంతొ నవ్వుకున్నాను.....so రోజు "ఆమెని" చూస్తూ చిన్నగా నాలోనేను నవ్వుకుంటాను... shanti nibha 17.09.12

Saturday, September 15, 2012

పసుపురంగు పుష్పం .......

రోజు ఉదయం walking కి వెళ్ళినపుడు ఎన్నో రంగు రంగుల పువ్వులనుచూస్తున్నను... దేవుడి కోసం అందులోని కొన్ని పువ్వులను కోసుకుందామని క్షణం పాటు అనిపించినా...ఎందుకో పూలను కొయ్యటానికి మనసు రావటం లేదు. ఆ పుష్పాలలో ఏ వొక్కటి కోసిన ..మరొక పుష్పం జాలిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. నన్ను కూడా దేవుడి పాదాల చెంత చేర్చవచ్చుకదా అని. పూజకు పువ్వులను కొని దేవుడికి పూజ చెయ్యగలుగుతున్నాను..కాని పువ్వులను చెట్టు నించి కోయ్యలేకపోతున్నాను. ఈ రోజు ఉదయం ఉద్యానవనం లో నడుస్తున్నపుడు సరిగ్గా నా కాలి ముందు పసుపురంగు పుష్పం చెట్టు మీదినించి పడింది. వెంటనే చేతిలోనికి తీసుకొని ఎంతొ ఆలోచించాను ... ఈ పుష్పం దేవుడి పాదాలను చేర్చన? లేక నా జడలో అందంగా అమర్చాన... లేక ఎవరు తొక్కని చోట ఉంచాన అని... ఎందుకో అలాగే చేతిలోనే పట్టుకొని ఇల్లు చేరాను. పూసిన ప్రతి పువ్వు దేవుడి పాదాలను చేరలేవు.. కాని దేవుడి పాదాలను చేర్చమని కోరినట్టి నా ఎదురుగ రాలిన ఆ పసుపు వర్ణం పుష్పాన్ని పూజలో సాయిబాబా పాదాలముందు వుంచాను. అప్పుడు మనసుకు తృప్తి కలిగింది. Shanti Nibha New Delhi 15.09.12

Wednesday, September 12, 2012

నువ్వంటే నాకు ప్రాణం అని....

నా కనుచూపె చాలు...నా దరిచేరటానికి... నా చిరునవ్వే చాలు...నా ఆధారాలను అందుకోవటానికి... నా శ్వాసే చాలు...నా గుండెలోతుల్లో చేరటానికి... నాలోని వయ్యారమే చాలు...నా ఒడిలో చేరటానికి... నా ప్రేమే చాలు నాతొ జీవించటానికి.... అని అనుక్షణం అనుకున్టువుంటాను.... .కాని .... ఎక్కడ కానరావు..... ఎక్కడ ఉన్నవో తెలియదు.. ఎలావున్నావో తెలియదు... ఎప్పుడు దరి చేరుతావో తెలియదు... ఏమితెలియను నీ గురించి ఇంతగా అలోచిన్చానంటే.. అర్థం చేసుకోలేవ...నువ్వంటే నాకు ప్రాణం అని.... Shanti Nibha 12.09.12

ఈ పిలుపు కోసమే ఎదురుచుసానురా..

ప్రియా ప్రియ సఖి... ప్రియ రాగమా.. ప్రియ ప్రేమాను రాగమా!!!!... ఓహ్!!! ఎంత మధురంగా పిలుస్తావురా.. ఈ పిలుపు కోసమే ఎదురుచుసానురా..గడిచిన జీవితంలో... ఈ పిలుపు చాలు మిగిలిన జీవితం "శాంతి" గా జీవించటానికి.... నీ రాగమయి... .. shanti nibha 12.09.12