Thursday, December 31, 2015

ఒకే ఒక్క తప్పు...

ఒక్కసారి నా తప్పుని ఒప్పుకోనివ్వు...
నువ్వు ఎటువంటి శిఖ విధించిన అనుభవించటానికి సిద్ధంగా వున్నాను...
నేను ఎటువంటి తప్పు చేయలేదని నీతో ఇంతకాలము చెప్పలేకపోవటమే నేను జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు...
ఆ తప్పునే ఒప్పుకోవాలని వుంది ఈ నా చివరి దశ లో...
ఎప్పుడు నన్ను కలుస్తావు ప్రియా?

Shanti Nibha
31.12.2015
shanti39@rediffmail.com

స్వరూపం ......



Monday, September 28, 2015

Identity ...???


shanti Nibha 28.09.2015

Sunday, September 27, 2015

స్తితి.....


నా స్తితి ఏమిటో తెలుసుకునేసరికి ఆలస్యం ఐపోయింది... నా స్తితిని మించి నిన్ను ఆదుకున్నాను...చేరదీసాను.. నీకు అంత అర్హత లేదని తెలిసిన నీ స్తితిని మించి నిన్ను చేరదీసాను..అంతగా నిన్ను ప్రేమించాను....వదిలేసి వెళ్ళిపోయావు... చివరికి నన్ను నేనే పోగొట్టుకున్నాను... జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి ఊహించుకో ...అర్హతలేని నిన్ను అంతప్రేమిస్తే ఇక నిన్ను ద్వేసిస్తే ఎలావుంటుందో.. నేడు ఎవరిని ఆదరించే స్తితిలో లేకపోయాను...లేకపోవటం ఏమిటి ఆదరించటం లేదు ... ఎవరిని నమ్మి చేరదీయను చెప్పు ? ఇది ఇప్పటి నా స్తితి :( shanti Nibha 28.09.2015

Tuesday, September 8, 2015

ఒహ్హ్...ఏమని వర్ణించను?

ఎవరో చెపితే ఏమో అనుకున్న..నిజం రా చాల చాల మైమరిపిస్తున్నాయి నీ కళ్ళు..నిన్ను కలిసిన క్షణమే అనిపించింది ఆ కళ్ళల్లో ...మైమరుపే కాదు...మత్తెక్కిస్తున్నాయి ...మురిపిస్తున్నాయి..ముద్దడమంతున్నాయి అని..... .ఒహ్హ్...ఏమని వర్ణించను? అలా చూస్తూ వుండలనిపించే నీ కళ్ళు నన్నే చూస్తూ ఏదో చెపుతున్నయనిపిస్తుంటే..అదేమిటో అర్థం చేసుకోలేకపోయాను.. అర్థం ఐన క్షణం ముద్దాడాలని అనిపించింది.. ఇక నీచిరునవ్వు చిందించే ఆ ఆధారాల మీద నా పేరు ను రాయలనిస్పిస్తోంది..అల నా పేరుని ఆధారాలమీద రాస్తుంటే నీలో కలిగే గిలిగింత నీ కళ్ళలో చూడాలనుకున్న...ఇది జరిగే పనేన? అ మ్మో...ఇది ఊహగానే మిగిలిపోతుందని తెలుసు... Shanti Nibha 08.09.2015

సమాంతర రేఖ....

Shanti Nibha 08.09.2015

Saturday, August 22, 2015

అరిచేతిలోని రేఖ....


మనసులోని భావాన్ని ఏమని చెప్పను? ఎందుకు కలిసావు? ఎలా కలిసావు? నిన్ను నా అరిచేతిలోని రేఖల కలపాలని అనుకున్నాను...ఎక్కడ కనపడటం లేదు ఎందుకంటే నీ మౌనం నా చేతి రేఖలో కలవలేకపోయింది.. నిన్ను మనసుతో పొందాలనుకున్న కానీ ఎప్పుడైతే చేతి రేఖలో నిన్ను చుడలేకపోయనో ...నా అరిచేతి రేఖలలో మరొక రేఖ ను మలచాలి అని అనిపించింది...ఎందుకంటే ఆ రేఖను నేను మాత్రమే చూడగలను కదా? Shanti Nibha 22.08.15

Friday, July 31, 2015

సాంగత్యం..


నా కోసం కన్నీరు కార్చవద్దు... నాకోసం అలజడులు వద్దు... శాంతం...సంతోషం...గ నా సాంగత్యం లో వుండు... అని రాసావు... నాకోసం కన్నీరు కార్చ వద్దు ..... జీవితంలో ఎన్నో కష్టాలు... చిరాకులు..మోసం..బాధలు...అన్యాయాలు..ఎవరి మీదో తెలియని కోపం ...కసి...క్రోదం ఇన్నిటిని అనుభవించిన నాలో కన్నీళ్ళు జల ప్రవాహమై..అన్ని సముద్రంలో కలిసిపోయాయి...ఇక కళ్ళల్లో కన్నీరు రావటం లేదు...ఇప్పుడు ఏడిస్తే రక్తమే చిందుతుంది... సో నో కన్నీరు...:) నాకోసం అలజడులు వద్దు ...... అలజడి ఎప్పుడు కలుగుతుంది ఎదుటి మనిషి నాకు కావాలి అని అన్నపుడు అలజడి మొదలవుతుంది...మనల్ని సొంతంగా భావించినపుడు ...నువ్వు నాకే సొంతం అని అనాలి కదా.... సో నో అలజడి... శాంతం..... నేను శాంతి నే కదా :) సంతోషం...... సంతోషం గ ఉంచుతున్నాను కదా... నా సాంగత్యం.. నీ సాంగత్యాన్నే కదా కోరుకుంటున్నది.... ఇంకేమి కావాలిరా...ప్రభా...:) Shanti Nibha 31.07.2015

Monday, July 6, 2015

ఎలాగ నిన్ను మర్చిపోవటం???


ప్రతి శ్వాస లోను నువ్వే......ప్రతి అక్షరం లోను నువ్వే..... ప్రతి జ్ఞాపకంలోను నువ్వే....నేను నేను గ బ్రతకటం లేదు.....ఎలాగ నిన్ను మర్చిపోవటం? ...నేను జీవించాలి అంటే నిన్ను మర్చిపోవాలి.....నిన్ను మరిచిపోయాను అంటే నేను జీవించలేను....ఎలాగ? .........06.07.15, Shanti Nibha

Saturday, July 4, 2015

తెలియని నీకోసం ?

నా శ్వాసని ఆగిపోనివ్వలేదు నేను ప్రేమించిన ప్రేయసి కోసం... కాని అర్థం కాని ప్రశ్న ఒక్కటే !! ..ఎందుకు ఇంత ప్రేమని అందిస్తున్నాను నువ్వు ఎవరో తెలియని నీకోసం ? శాంతి నిభ 04.07.15

వేదన...

నీకు దగ్గరగా వున్నాను అనే సంతోషం కంటే... నా దగ్గరగా నువ్వు అన్నలేవు వేదనే ఎక్కువగా వుంది...ఎందుకు అని అడిగిన ప్రతివోక్కరికి సమాధానం చెప్పాలిసి వస్తోంది ......అందుకే నేనే దూరమైతే నన్ను నేనే సమాధాన పరుచుకోవచ్చును కదా..... శాంతి నిభ 04.07.15

Friday, June 26, 2015

అమ్మ....నాన్న :)


అమ్మ సంరక్షణలో హాయి వున్నా.......నాన్న భరోసలో కనిపించని నిర్ణయం వుంటుంది... శాంతి నిభ 26.06.15

Thursday, June 25, 2015

శూన్యత... (shunyata...)

Design: Shanti Nibha

నిజమేరా నువ్వు అన్నట్టు నాకు ప్రేమంటే తెలియదు...ఎందుకంటే నేను ప్రేమించలేదు అన్నావు.. అసలు ప్రేమంటే ఏమిటి? దాని రూపం ఎలావుంటుంది? చెప్పగలవా? నా జీవితకాలం అంతా నీకు తోడుగా...నీడగా..నీ ప్రాణంగా వున్నాను...మరి దీన్ని ఏమంటారు? ప్రేమ లేక భాద్యతా? నువ్వు క్రూరం గ మాట్లాడిన క్షణం నించి నా మనసు ఎంత రోదిన్చిందో తెలుసా? పదే పదే నీ మాటలు నా చెవుల్లో హోరు ల వినపడుతోంది..నేను నేనుగా లేను.. ఇంత కాలం నీకోసం గ ఉన్నానంటే అది ప్రేమతో వున్నాను అని అనుకున్న..నీ మాటలు విన్నాకే అర్థం ఐంది నీ మనసులోని భావము. నిజమే ఇప్పుడు నా అవసరం నీకు లేదు కదా. నీ మాటలతో మనసు చాల దెబ్బతిన్నది రా... మాట మౌనం ఐంది.. అందరికి దూరం గ ఒంటరిగా వుండాలని వుంది.. అంతా శూన్యం గ ఉంటోంది... కిల కిల మని నవ్వే నా నవ్వు... గల గల మనే నా గళం మూగపోయిన్దిరా ... కళ్ళల్లో కనపడని ఆవేదన... అది వేదనో...ఆవేదనో తెలియటం లేదు.. అంతా శూన్యం గ వుంది.. Shanti Nibha Delhi 25.06.2015

Saturday, May 23, 2015

భావన vs భావం......

ఒహ్హ్ ఎంత అందమైన భావన .... కాని... భావన వేరు...... భావం వేరు... కదా.. భావన ఓకే ఊహ ఐతే.. భావం వాస్తవం... భావనకి .... భావం కి నడుమ ఎంత మంది నలిగిపోతున్నారో కదా? Shanti Nibha Dubai 23.05.15

Tuesday, May 19, 2015

మోహినివా...జగన్మోహినివా?..... Sketch : Aditya Nibhanapudi

జాలువారే నీ సొగసు లోని సౌందర్యాన్ని ఏమని వర్ణించను ప్రియ... జాణవ...నెల్లూరు నెరజానవ ? మోహినివా...జగన్మోహినివా? ప్రేయసి !! మైమరపించే నీ అందానికి దాసోహం అయ్యాను ... కనుసన్నలలోనించి కొంటెగా చూసే నీ కాటుక కళ్ళను ముద్దాడుతూ... లేలేత అధరాలను ముద్దులతో ముంచేస్తూ .... ముంగురులను సవరిస్తూ... సిగ్గులోని నీ సింగారాన్ని తమకంగా ...తాపంగా ఆస్వాదిస్తూ... జానెడు నడుము వంపు లోని నీ వయ్యారం ... ఇంకా...ఇంకా...ఏమని వర్ణించను.. జారనీయను సఖి ఈ రేయిని... జాగు చేయకే నా ప్రియ సఖి... Shanti Nibha Dubai.. 19.05.15

Thursday, May 14, 2015

ఉగాది పచ్చడి vs జీవితం :).....

ఉగాది తెలుగు వారి new year... ఉగాది పచ్చడి vs జీవితం చిరునవ్వులో తీపి..... చిరు కోపం లోని కారం చిరాకులోని వగరు.. చికాకు లో చేదు.... చెక్కిలి ఎరుపులో పులుపు చిరుగాలికి చెదిరిపోయే ఈ జీవితానికి మంచితనం ఉప్పు లాంటిది... సో ఇన్ని రుచులు లేనిదే జీవితం లేదు. ఇవన్ని రుచి చూసేది ఉగాది రోజునే .... inka emaina vunnaya? cheppagalara? Shanti Nibha Dubai 14.05.15

కాటుక కళ్ళు.....

కాటుక కళ్ళు వున్నాయి చూడగలిగితే... ఆ కళ్ళు మాట్లాడుతాయి వినగలిగితే.. ఆ కళ్ళు చెమర్చినపుడు జాలువారే కన్నీటి బిందువును అరిచేయి రేఖల నడుమ అందుకునే వాళ్ళు ఉండగలిగితే ..... అటువంటి కళ్ళు వున్నాయి... కానీ అల చూడగలిగిన వాళ్ళు...గుర్తిన్చేవాళ్ళు...కన్నీటిని అందుకునే వాళ్ళు ఎవరు లేరు.. Shanti Nibha Dubai 14.05.15

Monday, May 4, 2015

ముగింపు.... (Ending...)

Sketch: Aditya Nibhanapudi :)
ప్రేమలోనూ...పెళ్ళికి ముందు ఎన్నో కథలు వింటాము మగాడి నించి... ఆ కథలు మనసుని స్పందించి...హాయిని ఇస్తుంది....చివరికి తల్లి తండ్రులని కూడా మరిపించేస్తుంది...కళ్ళముందు ఎవరు కనపడరు... పెళ్లి అయ్యాక కాని తెలిసిరాదు ఆ కథలకి ముగింపు ఆడవాళ్లే రాసుకోవాలని... అందుకే ఒక్కొక్కరి ముగింపు ఒక్కొక్క రకంగా వుంటుంది.... Shanti Nibha Dubai 04.04.2015

Friday, January 2, 2015

.ఓ నేస్తమా...!!!


మనసు గాయం చేసినా...మౌన మైనా.. కలుసుకోవాల్లన్న  పరుగు  వుండదు...
కానీ..
ప్రేమించే మనసును చూడాలన్న ఆశ .... ఆత్రుత...వుంటుంది..
కళ్ళు తెలియకుండానే వెతుకుతాయి...
అర్థం అయివుంటుంది..
అర్ధాంతరంగా వదిలేసిన నీకు .....ఓ నేస్తమా...!!!

Shanti Nibha
02.01.2015