Tuesday, May 19, 2015
మోహినివా...జగన్మోహినివా?..... Sketch : Aditya Nibhanapudi
జాలువారే నీ సొగసు లోని సౌందర్యాన్ని ఏమని వర్ణించను ప్రియ...
జాణవ...నెల్లూరు నెరజానవ ?
మోహినివా...జగన్మోహినివా?
ప్రేయసి !! మైమరపించే నీ అందానికి దాసోహం అయ్యాను ...
కనుసన్నలలోనించి కొంటెగా చూసే నీ కాటుక కళ్ళను ముద్దాడుతూ...
లేలేత అధరాలను ముద్దులతో ముంచేస్తూ ....
ముంగురులను సవరిస్తూ...
సిగ్గులోని నీ సింగారాన్ని తమకంగా ...తాపంగా ఆస్వాదిస్తూ...
జానెడు నడుము వంపు లోని నీ వయ్యారం ...
ఇంకా...ఇంకా...ఏమని వర్ణించను..
జారనీయను సఖి ఈ రేయిని...
జాగు చేయకే నా ప్రియ సఖి...
Shanti Nibha
Dubai..
19.05.15
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment