Saturday, May 23, 2015

భావన vs భావం......

ఒహ్హ్ ఎంత అందమైన భావన .... కాని... భావన వేరు...... భావం వేరు... కదా.. భావన ఓకే ఊహ ఐతే.. భావం వాస్తవం... భావనకి .... భావం కి నడుమ ఎంత మంది నలిగిపోతున్నారో కదా? Shanti Nibha Dubai 23.05.15

Tuesday, May 19, 2015

మోహినివా...జగన్మోహినివా?..... Sketch : Aditya Nibhanapudi

జాలువారే నీ సొగసు లోని సౌందర్యాన్ని ఏమని వర్ణించను ప్రియ... జాణవ...నెల్లూరు నెరజానవ ? మోహినివా...జగన్మోహినివా? ప్రేయసి !! మైమరపించే నీ అందానికి దాసోహం అయ్యాను ... కనుసన్నలలోనించి కొంటెగా చూసే నీ కాటుక కళ్ళను ముద్దాడుతూ... లేలేత అధరాలను ముద్దులతో ముంచేస్తూ .... ముంగురులను సవరిస్తూ... సిగ్గులోని నీ సింగారాన్ని తమకంగా ...తాపంగా ఆస్వాదిస్తూ... జానెడు నడుము వంపు లోని నీ వయ్యారం ... ఇంకా...ఇంకా...ఏమని వర్ణించను.. జారనీయను సఖి ఈ రేయిని... జాగు చేయకే నా ప్రియ సఖి... Shanti Nibha Dubai.. 19.05.15

Thursday, May 14, 2015

ఉగాది పచ్చడి vs జీవితం :).....

ఉగాది తెలుగు వారి new year... ఉగాది పచ్చడి vs జీవితం చిరునవ్వులో తీపి..... చిరు కోపం లోని కారం చిరాకులోని వగరు.. చికాకు లో చేదు.... చెక్కిలి ఎరుపులో పులుపు చిరుగాలికి చెదిరిపోయే ఈ జీవితానికి మంచితనం ఉప్పు లాంటిది... సో ఇన్ని రుచులు లేనిదే జీవితం లేదు. ఇవన్ని రుచి చూసేది ఉగాది రోజునే .... inka emaina vunnaya? cheppagalara? Shanti Nibha Dubai 14.05.15

కాటుక కళ్ళు.....

కాటుక కళ్ళు వున్నాయి చూడగలిగితే... ఆ కళ్ళు మాట్లాడుతాయి వినగలిగితే.. ఆ కళ్ళు చెమర్చినపుడు జాలువారే కన్నీటి బిందువును అరిచేయి రేఖల నడుమ అందుకునే వాళ్ళు ఉండగలిగితే ..... అటువంటి కళ్ళు వున్నాయి... కానీ అల చూడగలిగిన వాళ్ళు...గుర్తిన్చేవాళ్ళు...కన్నీటిని అందుకునే వాళ్ళు ఎవరు లేరు.. Shanti Nibha Dubai 14.05.15

Monday, May 4, 2015

ముగింపు.... (Ending...)

Sketch: Aditya Nibhanapudi :)
ప్రేమలోనూ...పెళ్ళికి ముందు ఎన్నో కథలు వింటాము మగాడి నించి... ఆ కథలు మనసుని స్పందించి...హాయిని ఇస్తుంది....చివరికి తల్లి తండ్రులని కూడా మరిపించేస్తుంది...కళ్ళముందు ఎవరు కనపడరు... పెళ్లి అయ్యాక కాని తెలిసిరాదు ఆ కథలకి ముగింపు ఆడవాళ్లే రాసుకోవాలని... అందుకే ఒక్కొక్కరి ముగింపు ఒక్కొక్క రకంగా వుంటుంది.... Shanti Nibha Dubai 04.04.2015