Wednesday, December 18, 2013
కన్నతల్లి ప్రేమ ......
కనపరిచిన ప్రేమనే కాలతన్నుకొని వెళ్లిపోతుంటే...
ఇక
కనపడని ప్రేమను ఎవరు గుర్తిస్తారు ఈ రోజుల్లో...?
నువ్వంటే నాకు ప్రేమ అని మనసులో మాట తెలిపినపుడు జీవితాంతం తోడుగా వుంటూ
నీడలా వుండాలి..
మోసం, స్వార్థం ,డబ్బు , పిరికితనం, మూర్ఖత్వం, ఇలా ప్రేమలను దూరం చేస్తుంది.
అందుకే ప్రేమను కనపరిచినా దూరం అవుతున్నారు.
ప్రపంచంలో కనపడని ప్రేమ వుంది అంటే
అదికన్నతల్లి ప్రేమ ఒక్కటే.
విడదీయలేని ప్రేమ..
తల్లడిల్లే ప్రేమ..
మూగగా రోదిస్తూ ప్రేమించే ప్రేమ..
అలిసిపోయినా అలమటించే ప్రేమ..
అవమానపడినా అర్థం చేసుకునే ప్రేమ.
ఆశ చావని ప్రేమ..
అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ......
Shanti Nibha
New Delhi
18.12.13
Subscribe to:
Post Comments (Atom)
i accept this. nice, its heart touching
ReplyDelete