నిరుపేద బ్రతుకులు…
నిరుపేద బ్రతుకులలో కన్నీరు కానరాదు….
కడుపు ఆకలి తీరని వారికి కన్నీరు ఎక్కడిది?
ఎందుకు అంటే....
ఒక్కొక్కసారి ఆ కన్నీరే వారి దాహం తీరుస్తుంది కాబట్టి….
వారి కళ్ళలోని దైన్యం ఎప్పుడైనా చూశారా….
నిర్లిప్తం గా ఉంటుంది….
కడుపులోనే రోదించే మనసు..
గుండెలోతులలో గుబులు రేగే మనసు…
కస్తం వచ్చిన కన్నీటి చుక్కా రాల్చారు…
మనిషి ఏడుస్తున్నకొద్ది శరీరం అలిసిపోతుంది..
అలిసిపోయిన శరీరానికి ఆకలి తెలుస్తుంది…
ఆకలీని ఆదరించే వారు కానరారు…
దరిచేరెవారు కూడా ఉండరు….
అందుకే
దాహానికి దశోహమై ఆ దాహం తీరక దహనమై పోతున్న దారీద్య జీవితాలు ఎన్నొ..ఎన్నెన్నొ.
శాంతి నిభ
26.11.2011
No comments:
Post a Comment