Thursday, September 22, 2011

Hang them.....

ఆడపిల్ల పుట్టిందని విసిరేశారు…..

నిన్న ఒక చ్యానెల్ లో చూసి మనసు రోదించింది….

ఎంత అమానుషం …

సృష్టి లో రెండే జీవాలు..స్త్రీ…పురుషుడు.
కానీ రూపాలు ఎన్నో…ఎన్నెన్నో…

పరువాలకు ఆడది కావాలి….
ప్రకటనలకు ఆడది కావాలి….

ప్రక్కన పడుకోవటానికి ఆడది కావాలి…
హోయలు కురిపించటానికి ఆడది కావాలి…

క్లబ్ లో ఆడది కావాలి..
కాబ్రే కి ఆడది కావాలి….

వాణిజ్యానికి ఆడది కావాలి….
వొంపు సొంపులకు ఆడది కావాలి….

శృంగారానికి ఆడది కావాలి…
సృష్టికి ప్రతిసృష్టి లోను ఆడది కావాలి…

ఆడడాని కోసం రెడ్ లైట్ ఏరియాల చుట్టూ తిరుగుతారు
పోల్ డ్యాన్స్ లో కురిపించే ఆడదాని అందాలకు ఎగబడతారు

కానీ ఆడపిల్ల మాత్రం పుట్టకూడదు….

తల్లి ఆడదే…
భార్య ఆడదే…
పూజించే దేవి ఆడదే….
కానీ ఆడపిల్ల పుట్టిందని…పుడుతోందని ఎన్నో ఘోరాలు చేస్తున్నారు ఆడవాళ్ళు…మగవాళ్ళు… ఎందుకు?
ఇందులో ఆడదాని తప్పు కూడా వుంది అని చెప్పవచ్చు…
అసలు మగవాడు గా పుట్టి ఏమి ఉద్ధరించాడని ….ఇలాంటి ఘాతుకానికి పాలుపడుతున్నారు?
ఎవరికి ఎటువంటి సందేశం ఇవ్వాలి ? ఏమని ఇవ్వాలి ? ఎందుకు ఇవ్వాలి ?
శిక్షించటం ఒక్కటే చెయ్యాలి ఆది కూడా అరెస్టు…బెయిల్ …న్యాయపోరాటాలు….అంటూ యుగాలు గడవనీయకూడదు…
ఉరిశిక్ష వెయ్యాలి పబ్లిక్ లో….అప్పటికీ కానీ ఈ అరాచకాలు ఆగవేమో ! ….


శాంతి నిభా
21.09.2011

No comments:

Post a Comment