ధనుర్మాస తొలి వెలుగులో
గుడి లో వినిపించే M.S.సుబ్బలక్ష్మి సుప్రభాతం తోభగ భగ మండే భోగి మంటల వెలుగులో
కల్లాపి చల్లిన ధరణి చల్లదనములో
ముంగిట ముచ్చటైన ముత్త్యయాల్ ముగ్గులతో
గుమ్మడి పూలను సింగారించిన గొబ్బెమ్మల తో
ఈ రహదారి అంటా నాదే అంటూ అలంకరించిన రంగు రంగుల రంగ వల్లులతో
పల్లె పడుచుల సోయగాల సొగసులతో..
కన్నె పిల్లల వాలు చూపులతో
వలపు, వగలు కురిపించే వాలు జడ వయ్యారి వనజాక్షిలు
కళ్ళను అలరించిన కాటుక కన్నుల విశాలాక్షిలు...
బంతి, చామంతి లాంటి భామలతో...
హరిదాసు కీర్తనలతో...
గొబ్బెమ్మల గాన లహరిలో...
అన్ని రంగులు నావే నంటూ అలంకరించిన గంగిరెద్దు అందాలతో...
చిరుగంటల సవ్వడి నాదే నంటూ పరుగిడే గంగిరెద్దు మువ్వల సవ్వడులతో...
వచ్చే వచ్చే సంక్రాంతి..
మా ఊరికి తెచ్చే మహా కాంతి...
మా ఇంటికి వచ్చే మకర సంక్రాంతి
"సంక్రాంతి లక్ష్మి కిల కిల నవ్వుల ఝాల్లులలో కలకాలము శాంతి గ కళకళ లాడుతూ వుండాలని
హృదయపూర్వకముగా కోరుతూ
సంక్రాంతి శుభాకాంక్షలతో
శాంతి లక్ష్మి
No comments:
Post a Comment