Friday, June 26, 2015
Thursday, June 25, 2015
శూన్యత... (shunyata...)
Design: Shanti Nibha
నిజమేరా నువ్వు అన్నట్టు నాకు ప్రేమంటే తెలియదు...ఎందుకంటే నేను ప్రేమించలేదు అన్నావు..
అసలు ప్రేమంటే ఏమిటి? దాని రూపం ఎలావుంటుంది? చెప్పగలవా?
నా జీవితకాలం అంతా నీకు తోడుగా...నీడగా..నీ ప్రాణంగా వున్నాను...మరి దీన్ని ఏమంటారు? ప్రేమ లేక భాద్యతా?
నువ్వు క్రూరం గ మాట్లాడిన క్షణం నించి నా మనసు ఎంత రోదిన్చిందో తెలుసా?
పదే పదే నీ మాటలు నా చెవుల్లో హోరు ల వినపడుతోంది..నేను నేనుగా లేను..
ఇంత కాలం నీకోసం గ ఉన్నానంటే అది ప్రేమతో వున్నాను అని అనుకున్న..నీ మాటలు విన్నాకే అర్థం ఐంది నీ మనసులోని భావము.
నిజమే ఇప్పుడు నా అవసరం నీకు లేదు కదా.
నీ మాటలతో మనసు చాల దెబ్బతిన్నది రా...
మాట మౌనం ఐంది..
అందరికి దూరం గ ఒంటరిగా వుండాలని వుంది..
అంతా శూన్యం గ ఉంటోంది...
కిల కిల మని నవ్వే నా నవ్వు...
గల గల మనే నా గళం మూగపోయిన్దిరా ...
కళ్ళల్లో కనపడని ఆవేదన...
అది వేదనో...ఆవేదనో తెలియటం లేదు..
అంతా శూన్యం గ వుంది..
Shanti Nibha
Delhi
25.06.2015
Subscribe to:
Posts (Atom)