Wednesday, December 31, 2014

కాటుక కళ్ళు..

కళ్ళలో కనపరిచే ప్రేమని చూడు..
కళ్ళు వాల్చే సిగ్గుని చూడు,,,
కళ్ళలోని దీనత్వాన్ని గుర్తించు..
కళ్ళలోని నిస్సహాయత కి చేయుతనివ్వు..
కళ్ళుపలకరించే  భాషని   అర్థం చేసుకో...
కళ్ళలోని అమాయకత్వాని కి దాసోహం అవ్వు...
అందమైన కాటుక కళ్ళలో కన్నిరుని మాత్రం చూడకు...

Shanti Nibha
31.12.2014

నీ శ్వాశ....

ప్రేమించు...
ప్రేమను పంచు...
ప్రేమను పొందు..
 ఆ పొందులో ఒదిగిపో...
దూరంగా   వున్నా...దగ్గరగా వున్నా.. 
అదే  నీ శ్వాశ గ జీవించు...

Shanti Nibha
31.12.2014

అక్షరాలు ...


మనం రాసే అక్షరాలకి ఎంత పవర్ వుందో కదా...
మనసు స్పందించటానికి..... కౌగిలిలో కరిగిపోవటానికి...
 మూగ గా  జీవించటానికి...   మౌనం గ విడిపోవటానికి ...
కోపం తో రగిలిపోవటానికి...క్రోధం లో కాలిపోవటానికి...
కిల కిల నవ్వుతు కలిసిపోవటానికి...కన్నీటి తో   తడిసిపోవటానికి..
 ఆలోచించటానికి... అడుగు ముందుకు  వేయటానికి... 

Shanti Nibha 
31.12.2014



Monday, December 29, 2014

ప్రేమ ఝల్లు.....

drawing : Aditya Nibhanapudi
shanti Nibha 28.12.14