Friday, February 18, 2011

జీవన యాత్ర......

నేటి మానవ జీవన యాత్ర…
ఆకలితో అలమటించే "ఆకలి "యాత్ర…
ఆకలి తీరిన ఆరాటపడే "SCAM యాత్ర…
భక్తీ పారవశ్యంలో ఏడుకొండలు ఎక్కి ప్రయాణించే "భక్తీ "యాత్ర...
జ్యోతి దర్శనం లోమకరజ్యోతి లోకలిసిపోయే "జ్యోతి "యాత్ర….
సమైక్య వాదం లో"పాద "యాత్ర..
అమర్జీవుల నివాళి కై"ఓదార్పు"యాత్ర…
జీవన ప్రవాహంలో కొట్టుకుపోతున్నా "జీవన" యాత్ర…
జీవితాన్నేమార్చేసే "జల్సా"యాత్ర
అలిసిన ఘడియలో ఒరిగిపోయే "అంతిమ"యాత్ర
మానవజీవితానికి ఇదే "ముగింపు"యాత్ర….

జీవన యాత్ర....


Thursday, February 3, 2011

బంధం....


బంధం
భారమై...
బరువై...
భవిషత్తు తెలియని..
ఓ !!!! బాటసారి...
బంధము...భాగ్యమని...
భారము...ధర్మమని...
బరువు...తాత్కాలికమని...
భవిషత్తు అనే దారిని ..
రహదారిగా మలుచుకోరా...
ఓ !!!! మహర్షి....
శాంతి నిభ
౦౩.02.2011

Wednesday, February 2, 2011

అక్షరమాల !!!



మనసా నువ్వైనా చెప్పవే ..
నాలోని మౌనానికి కారణమేమిటో....
మౌన రాగాలతో....
మౌన భావాలతో...
మధురంగా మల్లెలలాంటి తేట తెలుగు అక్షరాలను
పూల మాలలలా అల్లే నేను.....
ఎందుకు ఈరోజు ఒక్కమాలాను కూడా అల్లలేక పోతున్నాను?
పరువంలా పరుగెట్ట పాళీ నుంచి అక్షర అల్లిక అందుకోలేకపోతున్నాను…ఎందుకు?
లోపం పూలలోన...అల్లే దారం లోనిదా? అన్నట్టూ...
పట్టు కుదరటం లేదు…
మనసులోఎటువంటి స్పందన కలగటం లేదు ఎందుకు?
ఎందుకిల మూగబోయింది?
పువ్వులాంటి నా మనసు
ఎందుకు ఇంతా ముకులించుకు పోయింది..???
శాంతి నిభ
02.02.2011