Friday, November 16, 2012
నువ్వు......నేను ఒక ప్రశ్న ల మిగిలిపోతున్నాము…????
నా కలలోనూనువ్వే అన్నావు…
కలలో కూడా కవ్వింతలే అన్నావు…
అదేమిటో నాకు కలలు రావు.... నిదురె లేని నాకు కల ఎక్కడిది?
మెలుకువగా ఉండి కలలు కంటారు కొందరు .. ఆ కళ కూడా లేదు నాలో..
తెలియని ఆలోచనలు…ఆ ఆలోచనలు ఏమిటో ఆది కూడా తెలియదు...
ఏమిటో జీవితం ఒక నిట్టూర్పుగా ఉంటోంది..
నీ ఆరాధనని ఆస్వాదించలేక పోతున్నాను..
నిన్ను తలచుకున్నప్పుడు తెలియని చిలిపి తలపులు….....చెక్కిల్లు ఎరుపెక్కుతున్నాయి ..
చేరువగ లేవని దిగులుగ ఉంది..
ఇదే నా నిదుర లేమికి కారణం అనుకుంటాను..
నువ్వు......నేను ఒక ప్రశ్న ల మిగిలిపోతున్నాము…????
శాంతి నిభా
new delhi
16.11.12
Thursday, November 15, 2012
Wednesday, November 7, 2012
క్షీరజా….
Drawing: Aditya Nibhanapudi
మధురంగా రాసినపుడు…. ఊహించే జవాబు ను చూడగాలుగుతాను….
అందుకే నువ్వు నచ్చావురా!!!!...
ప్రేమ విలువ తెలుసు...
మాటల మాధుర్యం తెలుసు...
అక్షరాల పొందిక …ఆ కూర్పు ఒ!!! గ్రేట్
ఆణిముత్యం లాంటి అక్షరాలను ఎక్కడ ...ఎప్పుడు అల్లలో తెలుసు...
ఈ అక్షరాల అల్లికలో ల నిన్ను అల్లుకు పోతున్నాను….
రోజు రోజుకి చేరువ అవుతున్నాను…చెక్కిల్లు ఎరుపెక్కుతున్నాయి...
ప్రపంచంలో ఇంత ప్రేమవున్నదని...ఇంతగా ప్రెమిన్చెవారున్తారని... తెలిసింది...నే తోడు నేనే అంటూ మనసుకు అండగా నిలిచవు...
ఈ ప్రేమను చేజారనివాకు... చేజార్చనీయను..
ఒక్కటి మాత్రం నిజం …
నువ్వు ఒక మధురమైనా ప్రేమికుడివి..
సదా నీ ప్రెమలొ...తెలిపొతున్న....అన్దమైన అప్పాలమ్మ….హహ్హ్హహ్
ఏమిటి అలా మొహం పెట్టవు ….పేరు బాగాలేదా….
ఒక్… నీఊహాసున్దరి క్షీరజా….
shanti nibha
New Delhi
08.11.12
Tuesday, November 6, 2012
మైకం......
Drawing: Aditya Nibhanapudi
చాలా చెప్పాను నీతో.... నేను చెప్పింది ఎంతో తక్కువ అనిపించింది..
ఇంకా గుస గుస గా చెప్పాలనిపించింది.....
చెప్పలేక గుండె బరువెక్కి పోయింది..
గుండెలోతుల్లో చిలిపి బాధ...
చిగురించే బాధ....
చేరువ కాలేని బాధ....
చేరువ అవ్వాలని ఉంది….....
చేరువైతే చెంగు చాటున చెరిపొతావెమొ......ంమ్మ్మ్మ్
గుర్తుకి వచ్చినపుడు తెలియని గిలిగిన్త
ఎదలో ఏదో తెలియను... ఆరాటం..
అందుకోవాలన్న ఆరాటం..
అందుకోలేక పోతున్న నిట్టూర్పు....
తీపి భాధా .... అందమైనభాధ....
మైకంకమ్మే బాధ...
ఎమౌుతోందినాలో...
మనసు లోని స్పందన ఇంతలా ఉంటుందా????ఏమో….
Shanti Nibha
New Delhi
07.11.12
అనామిక .....
Drawing : Aditya Nibhanapudi
ఎలావున్నావు నించి ఏమిటిరా !!! అనే పిలుపుకు పయనించిన ప్రేమ....
చిటపటల నించి చిరునవ్వుకు చేరిన ప్రేమ..
చిరునవ్వు నించి చెంగు చాటున చేరిన ప్రేమ....
చెంగు చాటున దోబుచులాడుతున్న ప్రేమ...
మాటల మధురిమ నించి ఆధారాల మధురిమలకు చేరిన ప్రేమ...
ఊహలలో ఔర్రుతలుగినచ్ చేరువై ఒకరిని ఒకరు కలుసుకున్నప్రేమ...
చూపులు కలిసినా చెంత చేరని ప్రేమ..
చెంత చేరిన చెయ్యి అందించని ప్రేమ...
ఇద్దరి కళ్ళల్లో విడిపోతున్న ప్రేమ...
తనువులు దూరమైనా మనసులో పదిలంగా దాచిన ప్రేమ ...
ఇంతటి ప్రేమను అందించే నీకు నేను ఏమి ఇవ్వగాలనురా?
నా ఆఖరి శ్వాస వరకు నీ ప్రేమ లోనే జీవిస్తానురా..
అంతవరకూ నా నీడలా వుంటావ న్న నమ్మకంతో, కంట కన్నీరు పెట్టిన్చావన్న ఆత్మా విశ్వాసంతో....జీవిస్తానురా...
నీ ప్రియమైన, ప్రాణమైన....అనామిక
shanti nibha
New delhi
06.11.2012
Subscribe to:
Posts (Atom)