Thursday, March 10, 2016

PRABHA vs PRANAY

Design... Shanti Nibha
                                                  
తెలిసి తెలియని వయసు లో చిగురించిన ప్రేమ...
మనసులోని మాట తెలపాలన్న ఆరాటం లో నీ దరిచేరాను.....
పరువంలోని వలపు వయ్యారాన్ని నీకై దాచివుంచాను అని చెప్పాలని పరుగులేట్టాను..
.కాని అందుకోలేకపోయనురా నిన్ను..
.అల వంటరిదాన్నై వెనుతిరిగి వచ్చేసాను.
ఇదే జీవితం అనుకున్న..
ఐన నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడి వేదించేవి..

కౌగిలిలోని గిలిగింతలు...గిల్లి కజ్జాలు ఆడాలనుకున్న..
ఒడిలో చేర్చి లాలించాలనుకున్న..
తాపం తో తడిసిపోయనే కాని నిన్ను చేరలేకపోయాను...
అనుకోని క్షణం లో కలిసిన నీ చూపులు నా కళ్ళలోని కనుపాపల్లో దాచేసాను..
.ఇక ఎవరికీ తెలియని నివ్వలేడునీ మీద ఇంట ప్రేమ వుందని...
ఒకప్పుడే ధైర్యం చేసి చెప్పవలసింది....తప్పు చేశాను .
చెప్పిన క్షణం నన్ను వదిలేవాడివ?
అప్పుడు ఎమై ఉండేదో తెలుసా నీకు...
ప్రణయ రాగంలో గుస ఉసలు ఆడేవాళ్ళము..
నువ్వు...నేను..ఏకమై మనం అయ్యేవాల్లము...
ప్రభ ..ప్రణయ...
ఒహ్హ్హ్...ఎంత అందమైన పేర్లు కదా మనవి...
ఈ అక్షరాలూ నీకే అంకితం ప్రియా...


Shanti Nibha
New Delhi
09.03.2016

2 comments:

  1. చాలా బాగుంది. అభినందనలు శాంతీ.

    ReplyDelete
  2. చాలా బాగుంది. అభినందనలు శాంతీ.

    ReplyDelete