Friday, July 31, 2015

సాంగత్యం..


నా కోసం కన్నీరు కార్చవద్దు... నాకోసం అలజడులు వద్దు... శాంతం...సంతోషం...గ నా సాంగత్యం లో వుండు... అని రాసావు... నాకోసం కన్నీరు కార్చ వద్దు ..... జీవితంలో ఎన్నో కష్టాలు... చిరాకులు..మోసం..బాధలు...అన్యాయాలు..ఎవరి మీదో తెలియని కోపం ...కసి...క్రోదం ఇన్నిటిని అనుభవించిన నాలో కన్నీళ్ళు జల ప్రవాహమై..అన్ని సముద్రంలో కలిసిపోయాయి...ఇక కళ్ళల్లో కన్నీరు రావటం లేదు...ఇప్పుడు ఏడిస్తే రక్తమే చిందుతుంది... సో నో కన్నీరు...:) నాకోసం అలజడులు వద్దు ...... అలజడి ఎప్పుడు కలుగుతుంది ఎదుటి మనిషి నాకు కావాలి అని అన్నపుడు అలజడి మొదలవుతుంది...మనల్ని సొంతంగా భావించినపుడు ...నువ్వు నాకే సొంతం అని అనాలి కదా.... సో నో అలజడి... శాంతం..... నేను శాంతి నే కదా :) సంతోషం...... సంతోషం గ ఉంచుతున్నాను కదా... నా సాంగత్యం.. నీ సాంగత్యాన్నే కదా కోరుకుంటున్నది.... ఇంకేమి కావాలిరా...ప్రభా...:) Shanti Nibha 31.07.2015

No comments:

Post a Comment