Wednesday, February 2, 2011

అక్షరమాల !!!



మనసా నువ్వైనా చెప్పవే ..
నాలోని మౌనానికి కారణమేమిటో....
మౌన రాగాలతో....
మౌన భావాలతో...
మధురంగా మల్లెలలాంటి తేట తెలుగు అక్షరాలను
పూల మాలలలా అల్లే నేను.....
ఎందుకు ఈరోజు ఒక్కమాలాను కూడా అల్లలేక పోతున్నాను?
పరువంలా పరుగెట్ట పాళీ నుంచి అక్షర అల్లిక అందుకోలేకపోతున్నాను…ఎందుకు?
లోపం పూలలోన...అల్లే దారం లోనిదా? అన్నట్టూ...
పట్టు కుదరటం లేదు…
మనసులోఎటువంటి స్పందన కలగటం లేదు ఎందుకు?
ఎందుకిల మూగబోయింది?
పువ్వులాంటి నా మనసు
ఎందుకు ఇంతా ముకులించుకు పోయింది..???
శాంతి నిభ
02.02.2011

No comments:

Post a Comment